ఆంధ్రప్రదేశ్‌

సముద్రంలో పడవ బోల్తా.. ముగ్గురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటిరేగ, అక్టోబర్ 11: తిత్లీ తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఒడిశాలోని రామయ్యపట్నం వద్ద పడవ బోల్తా పడిన సంఘటనలో ఈ ముగ్గురూ గల్లంతు కాగా, మరో ఇద్దరు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
దీంతో పూసపాటిరేగ మండ లం పతివాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. పతివాడ పంచాయతీ బర్రిపేట గ్రామానికి చెందిన సూరపు రాము (20), వాసుపల్లి లక్ష్మయ్య (35), తమ్మయ్యపాలెం గ్రామానికి చెందిన బాడి సత్తిబాబు (26) గల్లంతయ్యారు. అదే పడవలో ప్రయాణించిన బర్రిపేట గ్రామానికి చెందిన బర్రి అప్పన్న, అప్పయ్య పడవ ప్రమాదం నుంచి గాయాలతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. వీరంతా గత నెల 14న చేపల వేట నిమిత్తం పూసపాటిరేగ మండలం పతివాడ నుంచి ఎనిమిది మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్‌కు రెండు బోట్లలో బయలుదేరారు. వేట ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గల్లంతైన ముగ్గురు ఒకే పంచాయతీకి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. కాగా, గల్లంతైన మత్స్యకారుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా తుపాను ప్రభావానికి జిల్లాలో అరటి పంటకు నష్టం వాటిల్లింది.
దాంతో పాటు విద్యుత్ స్తంభాలూ నేలకొరిగాయి. కాగా, ఏ మేరకు నష్టం వాటిల్లిందన్న విషయమై అధికారులు అంచనా వేస్తొన్నారు.
చిత్రం..గల్లంతైన మత్స్యకారులు రాము, లక్ష్యయ్య