ఆంధ్రప్రదేశ్‌

కోస్తాను కుదిపేస్తున్న తుపాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 11: నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు ఆరంభమయ్యాయంటే, ఏపీలోని కోస్తా తీర ప్రాంతవాసుల్లో ఎక్కడిలేని భయం అలముకుంటుంది. గడచిన 30 సంవత్సరాల నుంచి అనేక తుపాన్లను, హరికేన్లను కోస్తా ప్రజలు కళ్లారా చూశారు. ఈ 30 ఏళ్లలో వేలాది మంది ప్రాణాలను తుపానులు పొట్టనపెట్టుకున్నాయి. చేతికందిన పంట వరదపాలైంది. ఆవాసాలు కూలిపోయి లక్షల్లో జనం నిరాశ్రయులయ్యారు. ఏటా కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చి వెళుతున్నాయి తుపానులు. తాజాగా తిత్లీ తీవ్ర తుపాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విలయాన్ని సృష్టించింది. తొమ్మిది మంది ప్రాణాలను బలిగొంది. పంట, ఆస్తి నష్టాన్ని మిగిల్చి వెళ్లింది. 1971 సంవత్సరం నుంచి కోస్తాను వణికించిన పెను తుపానులు గురించి తెలుసుకుంటే, గుండెల్లో వణుకు పుడుతుంది. ఈ 30 ఏళ్లలో ఎక్కువగా పెను తుపానులే సంభవించాయి. వచ్చిన తుపానుల్లో చాలా వరకూ ఒడిశాలోని గోపాల్‌పూర్‌పైనే పగబట్టడం గమనార్హం.
1971 సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి 14వ తేదీ వరకూ పెను తుపాను దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటింది. ఈ తుపానులో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా దెబ్బతింది.
1971 సెప్టెంబర్ 20-25 మధ్య వచ్చిన మరో పెను తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడి భారీ నష్టాన్ని మిగిల్చింది.
1972 సెప్టెంబర్ ఏడు నుంచి 14వ తేదీ వరకూ శ్రీకాకుళం జిల్లా బారువపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
1972 నవంబర్‌లో వచ్చిన పెను తుపాను శ్రీహరికోటపై ప్రభావం చూపింది.
1976 నవంబర్ 3-6తేదీల్లో సంభివంచిన పెను తుపాను మచిలీపట్నంపై ప్రభావం చూపింది.
1976 నవంబర్ 15-17 మధ్య వచ్చిన పెను తుపానదు నెల్లూరు, కావలి మధ్య తీరం దాటింది. దీని ప్రభావం నెల్లూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది.
1977 నవంబర్ 15-20 మధ్య సంభవించిన తుపాను దివిసీమను అతలాకుతలం చేసి, భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చి వెళ్లింది. దీని ఫ్రభావం గుంటూరు, శ్రీకాకుళం జిల్లాపై కూడా పడింది.
1979 మే 5-13 తేదీల మధ్య ఏర్పడిన పెను తుపాను 12వ తేదీన ఒంగోలు, బాపట్ల మధ్య తీరాన్ని దాటింది. దీని ప్రభావం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలపై పడింది.
1979 నవంబర్ 24-25 మధ్య ఏర్పడిన తుపాను శ్రీహరికోట వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావం కోస్తా జిల్లా అంతటా కనిపించింది.
1080 అక్టోబర్ 16-18 మధ్య ఏర్పడిన తీవ్ర తుపానుతోపాటు హరికేన్ కూడా కలిసి రావడంతో శ్రీకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ ప్రభావం చూపింది.
1982 అక్టోబర్ 16-18 తేదీల మధ్య ఏర్పడిన తుపాను శ్రీహరికోట వద్ద తీరం దాటింది. దీని ప్రభావం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై పడింది.
1983 అక్టోబర్ 3-5 మధ్య సంభవించిన తుపాను భీమునిపట్నం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లావరకూ పడింది. ఈ తుపాను ధాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా పంట, ఆస్తి నష్టం సంభవించింది.
1984 నవంబర్ 11-15 మధ్య ఏర్పడిన పెను తుపాను నెల్లూరు జిల్లాను కుదిపేసింది.
1985 అక్టోబర్ 10-11 మధ్య ఏర్పడిన తుపాను విశాఖపట్నం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి ఉభయగోదావరి జిల్లాలపై పడింది.
1987 అక్టోబర్ 15-16 మధ్య ఏర్పడిన తుపాను ఒంగోలు వద్ద తీరం దాటింది. దీని ప్రభావం కోస్తా జిల్లా అంతటా కనిపించింది.
1987 నవంబర్ 2-3 తేదీల మధ్య ఏర్పడిన తుపాను నెల్లూరు జిల్లా వద్ద తీరాన్ని దాటింది. దీనివలన కోస్తాలోని అన్ని జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
1987 నవంబర్ 12-13 తేదీల మధ్య సంభవించిన పెను తుపాను గుంటూరు-దక్షిణ మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ పంట, ఆస్తి నష్టం సంభవించింది.
1989 మే 5-10 తేదీల మధ్య పెను తుపానుతోపాటు, హరికేను కలిసి రావడంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
1990 మే 5-10 తేదీల మధ్య వచ్చిన పెను తుపాను మొత్తం కోస్తా జిల్లాల్లో బీభత్సాన్ని సృష్టించింది. ఈ తుపాను కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో తీరాన్ని దాటడం గమనార్హం.
1991 నవంబర్ 11-15 తేదీల మధ్య ఏర్పడిన తుపాను నెల్లూరు జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టించింది.
1992 నవంబర్ 3-6 తేదీల మధ్య ఏర్పడిన తుపాను కాకినాడ వద్ద తీరం దాటింది. ఈ తుపాను తూర్పు గోదావరి జిల్లాలో పెను విలయాన్ని సృష్టించి వెళ్లింది.
1994 అక్టోబర్ 29-31 మధ్య ఏర్పడిన పెను తుపాను చెన్నై వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావం వలన నెల్లూరు, ప్రకాశం జిల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.
1995 నవంబర్ 9, 10 తేదీల్లో సంభవించిన పెను తుపాను, హరికేన్ల ప్రభావం వలన ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది.
1996 జూన్ 5-7 తేదీల్లో ఏర్పడిన తుపాను విశాఖపట్నం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తాలో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
1996 నవంబర్ 5-7 తేదీల మధ్య సంభవించిన పెను తుపాను, హరికేన్ ప్రభావం వలన దక్షిణ కోస్తా జిల్లాలను అతలాకుతలం చేశాయి.

చిత్రాలు.. ధ్వంసమైన రహదారి రహదారిపై ఆగి ఉన్న బస్సులపై విరిగిపడిన చెట్ల కొమ్మలు