ఆంధ్రప్రదేశ్‌

పుష్కర తొక్కిసలాట ఘోరానికి... రేపటికి సరిగ్గా ఏడాది! ( నేటికీ చర్యలు శూన్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 12: గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘోరానికి శుక్రవారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తి కావొస్తోంది. గోదావరి మహా పుష్కరాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గత ఏడాది జూలై 14న భారీ తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే. ఈ దుర్ఘటనలో 30 మంది మృత్యువాత పడగా, 61మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు బాధ్యులైన ఎవరిపైనా కనీస స్థాయి చర్యలు కూడా తీసుకోలేదు. పుష్కర పుణ్య స్నానం ఆచరించి పునీతమవుదామని వచ్చిన భక్తజనం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటకు గురయ్యారు. గోదావరి నదిని చూస్తూనే జనం మధ్య నలిగిపోయి కన్నుమూశారు. ఆ దుర్ఘటన పవిత్ర గోదావరి మేనుపై మానని గాయం.. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ గడువు కూడా ముగిసింది. మళ్లీ ఈ గడువును పెంచుతారా లేక.. ముగించేస్తారా అనేది ఇంకా తేలలేదు. కమిషన్ విచారణ కొలిక్కి రాలేదు.
గత ఏడాది జూలై 14న ఉదయం ఆరు గంటల 26 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానాన్ని ఆచరించి పుష్కరాలను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదాన క్రతువు నిర్వహించి ఏడున్నర గంటల ప్రాంతంలో పుష్కర ఘాట్ నుంచి బయటకు వచ్చారు. అదే ముహూర్తానికి జయేంద్ర సరస్వతి స్వామీజీ కూడా పుష్కర స్నానాన్ని ఆచరించారు. పుష్కర ప్రారంభోత్సవ ముహూర్త సమయానికి ముఖ్యమంత్రి పుష్కరాలను ప్రారంభించే పుష్కర ఘాట్ వద్దకు లక్షలాదిగా భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగానే తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి ఎట్టకేలకు జస్టిస్ సివై సోమయాజులుతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 29న కమిషన్ చార్జి తీసుకుంది. జనవరి 18న మొదటి విచారణ నిర్వహించడం జరిగింది. అనంతరం ఫిబ్రవరి 28న మరో విచారణ జరిగింది. మార్చి 21న మరో విచారణ జరిగింది. అదే నెల 29వ తేదీతో కమిషన్ గడువు ముగిసింది. అప్పటికీ అధికారులు ఎటువంటి అఫిడవిట్లు దాఖలు చేయలేదు. అనంతరం మరో మూడు నెలల పాటు కమిషన్ గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ జూన్ 14, 18, 21, 28 తేదీల్లో విచారణ నిర్వహించింది. అదే నెల 29వ తేదీతో ఆ గడువు కాస్తా ముగిసింది. ఇప్పటికీ విచారణ కొలిక్కి రాలేదు. అధికారులు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఇంత ఘోర దుర్ఘటనకు ఏడాది పూర్తయినా ఇంతవరకు ఎవరిపైనా చర్యలు లేకపోవడం గమనార్హం.