ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: పట్టణ ప్రజలపై భారాలు పెంచి, మున్సిపల్ కార్మికుల ఉపాధికి ముప్పు తెచ్చే జీఓ నెం 279 రద్దు కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వ ఏ మాత్రం స్పందించకపోవడంతో వీరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. విజయవాడలోని అన్ని కార్మిక సంఘాలు సోమవారం సమావేశమై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించాయి. 12 రోజులైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పోలీసుల ద్వారా సమ్మెను అణచివేసేందుకు ప్రయత్నించడాన్ని అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని కార్మికసంఘ నేతలు అన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయుసి, ఐఎన్‌టీయుసి, సీఐటీయు, ఐఎఫ్‌టీయు తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.