ఆంధ్రప్రదేశ్‌

నిన్న హుదూద్.. నేడు తిత్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: నిన్న హుదూద్.. నేడు తిత్లీ.. రెండు తుపానులు కోస్తాంధ్రపై విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపచేశాయి. సంక్షోభ సమయాల్లో సమర్థవంతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నీ తానై తుపాను కదలికలను గమనిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, తుపాను సహాయక చర్యలనూ పర్యవేక్షించారు. ప్రకృతి విపత్తు నుంచి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నియంత్రించడమే లక్ష్యంగా అధికార యంత్రాగానికి దిశానిర్దేశం చేశారు. ప్రాణ నష్టం గణనీయంగా తగ్గించడమే కాకుండా, తుపాను సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి తుపాను గమనాన్ని అంచనా వేసి ప్రజలను అప్రమత్తులను చేశారు. భవిష్యత్తులో ఎటువంటి తుపానులు వచ్చినా, సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ప్రభుత్వానికి ఉందనే భావన ప్రజల్లో సీఎం నెలకొల్పారు. ఎదుర్కొనే విధానంపై అధికార యంత్రానికి స్పష్టమైన అవగాహన కలిగేలా చేశారు. 2014 అక్టోబర్ 12న హుదూద్ తుపాను కోస్తాంధ్రపై విరుచుకుపడింది. విశాఖ నగరంలో తీరాన్ని తాకిన తుపాను విశాఖ సహా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. విశాఖ నగరం తుపాను తాకిడికి చిగురుటాకులా వణికిపోయింది. విశాఖ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో నగరం ధ్వంసమైంది. కకావికలమైన విశాఖలో సాధారణ పరిస్థితిని త్వరగా తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజు లు నగరంలోనే బస్సులో బస చేసి, సహాయక పనులను పర్యవేక్షించారు. వారం రోజుల్లో విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించగలిగారు. అర్ధరాత్రి అకస్మిత తనిఖీలు, ప్రజల అభిప్రాయాన్ని కాల్‌సెంటర్ ద్వారా సేకరించి, అధికారులతో దానిపై సమీక్షించడం ద్వారా త్వరితగతిన విశాఖ నగరం కోలుకునేలా చేశారు. అలుపెరుగకుండా సహాయక పనులు సీఎం పర్యవేక్షించడంతో విశాఖ త్వరగా కోలుకుంది.
సరిగ్గా నాలుగేళ్ల తర్వాత..
సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత ఉత్తరాంధ్రపై ప్రకృతి మరోసారి పగబట్టింది. ఈసారి తిత్లీ తుపాను రూపంలో శ్రీకాకుళం జిల్లాపై తన ప్రభావం చూపించింది. అక్టోబర్ 11న పలాస సమీపంలో తీరం దాటింది. తుపాను ధాటికి శ్రీకాకుళం జల్లా కకావికలమైంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులకు పలు గ్రామాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలింది. తుపాను తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాత్రంగా జాగారం చేశారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ స్టేట్ కమాండ్ సెంటర్‌తో టచ్‌లో ఉండి తాజా సమాచారంతో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి రెండు గంటలకు ఒక సారి పరిస్థితిని సమీక్షించడం విశేషం. ప్రాణనష్టాన్ని నివారించడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దివిసీమ, తూర్పుగోదావరి జిల్లాలో తుపాను కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందగా, హుదూద్, తిత్లీ తుపానుల్లో జననష్టం దాదాపు లేకుండా చేయగలిగారు. తిత్లీ తుపానుకు సంబంధించి కదలికలను కచ్చితంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజానం వల్ల గుర్తించగలిగారు. దీని వల్ల ప్రాణనష్టం నియంత్రించేందుకు వీలైంది.
తుపాను తీరం దాటాక, తెల్లవారిన తరువాత నుంచే సహాయక చర్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. అధికారులను, క్షేత్ర స్థాయి సిబ్బందిని, మహిళా సంఘాలను అప్రమత్తం చేసి సహాయక చర్యల్లోకి దించారు. మధ్యాహ్నం తాను స్వయంగా శ్రీకాకుళం వెళ్లి సహాయక పనులను పర్యవేక్షించారు. 50 మంది ఐఏఎస్ అధికారులను, మంత్రులను, కార్యదర్శులను శ్రీకాకుళం తరలించారు. దాదాపు సచివాలయం మొత్తం శ్రీకాకుళం తరలివెళ్లింది. సహాయక పనులు ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీజీఎస్‌లోని ‘అవేర్’ సహకారంతో తుపాను కదలికను కచ్చితంగా అంచనా వేయగలిగారు. అదే తరహాలో ఆన్‌లైన్‌లో సహాయక చర్యలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికాలకు చేరవేసి పరిష్కారమయ్యేలా చూస్తున్నారు.