ఆంధ్రప్రదేశ్‌

తిత్లీ తుపాను నష్టం రూ.3435 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 3435 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అదే విధంగా విభజన హామీలు అమలు చేయాలని కూడా కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కూడిన బృందం గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం రాత్రి కేంద్ర మంత్రిని కలిసి ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందచేశారు. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి 1200 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా అందించాలని కోరారు. 872 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ పాడైందని, 1.64 లక్షల హెక్టార్ల మేరకు పంటలు ధ్వంసమైనాయని తెలిపారు. విద్యుత్ రంగానికి 505 కోట్ల రూపాయలు, రహదారులకు 406 కోట్లు, హార్టికల్చర్‌కు 1000 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 100 కోట్లు, గృహా నిర్మాణ శాఖకు 220 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. తుపాను సహాయ చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆ లేఖలో తెలిపారు. కేంద్రం నుంచి తక్షణ సహాయం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 2 లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గతంలో హుదూద్ తుపాను సమయంలో ప్రధాని మోదీ 1000 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు హామీ ఇచ్చి, 551 కోట్ల రూపాయలే విడుదల చేశారని గుర్తు చేశారు. మరో 926 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకూ తుపాను ప్రభావిత ప్రాంతంలో కేంద్రం నుంచి ఎవరూ పర్యటించలేదని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు వీలుగా నిధులు కేటాయించాలని కోరారు.
విభజన హామీలను అమలు చేయండి
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కలిసి సీఎం రాసిన లేఖను మంగళవారం అందచేశారు.
ప్రత్యేక హాదా, వివిధ కేంద్ర విద్యా సంస్థలు, రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఆస్తుల పంపకం తదితర అంశాలను పరిష్కరించాలని కోరారు.

చిత్రం..కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందజేస్తున్న ఎంపీలు, మంత్రులు