ఆంధ్రప్రదేశ్‌

ఆహార తయారీ రంగంలో 50వేల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: ఆహార తయారీ రంగంలో 50 వేల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నెలకొల్పనున్న ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు పలు రకాల ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పొగాకు, కొబ్బరి బోర్డుల మాదిరిగా మామిడి, అరటి పంటలకు సంబంధించి డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా ఊపందుకున్నాయి. మామిడి, బొప్పాయి, నిమ్మ, టొమాటో, మిర్చి, పసుపు పంటల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటల ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో ఉంది. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటే, మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తుల్లో మూడో స్థానంలో ఉన్నాం. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తుల్లో మూడో స్థానంలో ఉంది. ఈ ఉత్పత్తులను ఆధారం చేసుకుని రాష్టవ్య్రాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఓ మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వివిధ సంస్థలతో జరిగిన ఒప్పందాల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా సంస్థలు నెలకొల్పనున్న ప్రాజెక్టుల ఆధారంగా ప్రతి జిల్లాలోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్, అల్ట్రా మెగా ఫుడ్ పార్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ మూడు కేటగిరీల వారీగా ఆయా సంస్థలు నెలకొల్పనున్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా భారీగానే కల్పించబోతోంది. రాష్ట్రాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మేరకు ఉద్యానవన ఉత్పత్తులతో భారీ స్థాయిలో పరిశ్రమల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. మామిడి, అరటి, బొప్పాయి, జామ, నిమ్మ, కొబ్బరి, జీడి, దానిమ్మ, ఆయిల్ పామ్, పసుపు పంటల్ని భారీ స్థాయిలో ప్రోత్సహించడమే కాకుండా ఆయా ఉత్పత్తులతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు. టొమాటో, ఉల్లి, క్యారెట్ వంటి కూరగాయలు, మిర్చి, పసుపు వంటి స్పైసెస్‌తో పాటు పాలు, మాంసాహార ఉత్పత్తులతో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నాలుగేళ్లలో ఈ ఫుడ్ పార్కుల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎన్‌జిఆర్‌ఐ డైరెక్టర్‌గా డాక్టర్ విఎం తివారి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 13: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ విఎం తివారి నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్టు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దేవేందర్ కుమార్ చెప్పారు. డాక్టర్ తివారి ఇంత వరకూ తిరువనంతపురం నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సిస్టమ్స్ స్టడీస్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.