ఆంధ్రప్రదేశ్‌

కుట్ర రాజకీయాలు మానుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 22: విభజనాంతరం ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ఫై కుట్ర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ నేతలకు సాంఘీక సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి నక్కా ఆనందబాబు హితవు పలికారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వ్యవహారంలో బీజేపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుండి రూ. 6,500 కోట్ల రూపాయలను వసూలు చేసిందన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఉందన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బు చెల్లిస్తామని ముందు చెప్పి, ఏడాది తరువాత వెనక్కు తగ్గిన ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర బీజేపీ ఎంపీ అని తెలిపారు. అసలు ఆ గ్రూప్ ఎందుకు ముందుకు వచ్చిందో, ఎందుకు వెనక్కి తగ్గిందో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రధాన నిందితులు అవ్వారు సీతారామ్‌ని బీజేపీ నేతలు ఐవైఆర్ కృష్ణారావు, కన్నా లక్ష్మీనారాయణలే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌కు పరిచయం చేసినట్లు గుర్తు చేశారు. సీతారామ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బంధువని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నోయిడా - గుర్గామ్ ప్రాంతాలలో సీతారామ్‌ని ఆరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన కన్నా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ఏదో చేశామని చెప్పుకోవడానికి కన్నా అసలు విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నట్లు విమర్శించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మద్దతుగా కన్నా దీక్షలు చేస్తున్నట్లుగా ఉందన్నారు. అసలు వారి దీక్షలో బాధితులు ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించమని కర్ణాటక ప్రభుత్వం కోరిందని, విచారణకు ఆదేశించలేదేం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ కారణంగానే రూ. 21 వేల కోట్ల ఆస్తులకు అటాచ్‌మెంట్ తెచ్చినట్లుగా వివరించారు. తన అవినీతి సొమ్మును దాచుకోవడానికి కన్నా పార్టీ మారారన్నారు. వైసీపీలోకి వెళ్లాల్సిన కన్నా బీజేపీలోకి మారారని విమర్శించారు. జీజేపీకి ఏపీలో ఓట్లు లేవని, వారికి ఒక్క ఓటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన హామీలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఆగదన్నారు. ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలంతా వెంట ఉన్నట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, వారి వల్ల కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుపై నమ్మకంతో ఉన్నట్లు ఆనందబాబు వివరించారు.