ఆంధ్రప్రదేశ్‌

కోలుకుంటున్న శ్రీకాకుళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: తిత్లీ తుపాను దెబ్బ నుంచి శ్రీకాకుళం కోలుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో చేపడుతున్న సహాయక చర్యలు ముమ్మరం కావడంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంటోంది. సహాయక చర్యల్లో భాగంగా అందచేస్తున్న భోజనానికి డిమాండ్ తగ్గింది. భోజనం అవసరమన్న కుటుంబాలు కేవలం 136 మాత్రమే. ఆదివారం మధ్యాహ్నం 1.54 లక్షల మందికి భోజనం సరఫరా చేయగా, సోమవారం నాటికి 136 కుటుంబాలకు పడిపోవడం గమనార్హం. నిత్యావసరాలు, నీరు, విద్యుత్ పునర్ధురణ జరగడమే ఇందుకు కారణం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నీటి పథకాలు 365 దెబ్బ తినగా, వాటిలో 2 మాత్రమే పునర్ధురించాల్సి ఉంది. అన్ని మండల కేంద్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇంకా విద్యుత్ సరఫరా కావాల్సిన గ్రామాలు కేవలం 259 మాత్రమే. మరో రెండో రోజుల్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు.