ఆంధ్రప్రదేశ్‌

అందరూ బాగా పని చేశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: తిత్లీ తుపాను సహాయక చర్యల్లో అందరూ బాగా పని చేశారని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. సహాయక చర్యలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగిందన్నారు. తుపాను సహాయక చర్యలపై మంత్రులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో వెలగపూడి సచివాలయం నుంచి సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, చిన్న పొరబాటు చేసినా, అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్లో సంతృప్తి 1.5 శాతం పెరిగి 62.4 శాతానికి చేరిందన్న సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు అనుమతించిన చోటే విద్యుత్ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. పంట తొక్కేసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులు కోరితే కోతలు పూర్తి అయ్యేంత వరకూ విద్యుత్ పనులు వాయిదా వేయాలని సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు 88 శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు మంగళవారానికి పూర్తి చేయాలన్నారు. ఇంకా 98 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందన్నారు. గార, ఇచ్ఛాపురం, జలుమూరులో తాగునీటిపై దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలను సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని, మంగళవారం డెబ్రిస్‌ను తొలగించాలన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పొలాల్లో చెట్ల తొలగింపు వేగవంతం చేయాలన్నారు. 667 గ్రామాల్లో ఒకేరోజు పరిహారం చెక్కులు పంపిణీ చేయాలన్నారు. ముందు రోజు గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. నష్టపరిహారం పంపిణీపై ప్రాథమిక ప్రకటన, అభ్యంతరాల పరిశీలన, తుది ప్రకటన అన్నీ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరిహారం పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలన్నారు. సోంపేట స్ట్రాంగ్ పేరుతో నిర్వహించిన ర్యాలీలకు మంచి స్పందన లభించిందని, ఇదే స్ఫూర్తి మిగిలిన ప్రాంతాల్లో కూడా రావాలన్నారు. బాధితుల్లో భరోసా పెంచేలా చేయాలన్నారు.