ఆంధ్రప్రదేశ్‌

ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఫల్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని జనసేన అథినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపానులో నష్టపోయిన వారు ఇంకా కోలుకోకముందే, తుపాను ప్రాంతాల్లో పరిస్థితి అంతా మెరుగుపడిందని ముఖ్యమంత్రి ప్రచార విన్యాసాలు చేయడం వలన, సాయం అందించడానికి కేంద్రం ముందుకు రావడం లేదన్నారు. తిత్లీ తుపాను దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా, అందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి తన అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించలేకపోయారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో హాం రేడియో వినియోగం ఎక్కడా కనిపించలేదన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరావు శ్రీకాకుళం జిల్లాపై దృష్టిపెట్టారా? అని పవన్ ప్రశ్నించారు. కేంద్రం తనకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నారు. తుపాను తీవ్రత ఏమేరకు ఉందన్న విషయాన్ని ఆయన కేంద్రం దృష్టికి ఇప్పటికీ తీసుకువెళ్లలేకపోవడం వలనే కేంద్రం స్పందించలేదని పవన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరాన్ని బాధితులపై చూపించద్దని మోదీ, చంద్రబాబును ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.
ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాలకు మాత్రమే సహాయం అందుతోంది. మారుమూల పల్లెలు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయన్నారు. కొన్ని గ్రామాల్లో జీలుగు చెట్టు బెరడు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్న జనం ముఖ్యమంత్రికి కనిపించలేదా? అని ఆయన ప్రశ్నించారు. నేలకొరిగిన చెట్లు ఎండిపోయి, అగ్గిప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు ఎన్ని నేలకొరిగాయి? పంటలు ఏమేరకు దెబ్బతిన్నాయన్న లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ సేకరించలేకపోయిందని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 900 బృందాలు పనిచేస్తున్నాయని సీఎం చెప్పారు. వాస్తవానికి 150 బృందాలు మాత్రమే పనిచేస్తున్నాయన్న విషయాన్ని తాము క్షేత్రస్థాయి పర్యటన ద్వారా తెలుసుకున్నామని పవన్ చెప్పారు. తుపాను సహాయం ఇంకా పూర్తిగా అందనే లేదు. అయినా, తుపాను ప్రాంతాల్లో పనిచేసిన సిబ్బందిని ఈనెల 29న సన్మానించడానికి ముఖ్యమంత్రి ఏవిధంగా సిద్ధపడుతున్నాని పవన్ ప్రశ్నించారు.
స్వపక్షీయులకే సహకారం!
వేల ఎకరాల పంటలు, ఉన్న గూడు పోగొట్టుకుని నిలువ నీడ లేని వారిని ఆదుకోవడం మానేసి అధికార పార్టీ రాజకీయం చేస్తోందని అన్నారు. టీడీపీకి చెందిన వారికి మాత్రమే అంతో, ఇంతో సహకారాన్ని అందిస్తోంది. అదే వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారి ముఖమైనా చూడ్డం లేదని పవన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం వలనే బాధితులకు నేరుగా సాయం అందడం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి చంద్రబాబు అబద్ధాలు చెప్పి, ఉద్దానం, పలాస ప్రాంత ప్రజల కోపాగ్నికి గురికావద్దని పవన్ హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని బాధితులకు సహాయం అందించకపోతే, చాలా మంది వలసలు వెళ్లాల్సి వస్తుందని అన్నారు.తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను తెలియచేసే ఫొటోలు, డాక్యుమెంటరీ క్లిప్పింగ్స్‌తో పాటు ఒక లేఖను ప్రధానికి రాయనున్నామని పవన్ చెప్పారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు జనసేన పార్టీ తరపున ఏడు బృందాలను నియమించామని, తుపాను వలన తీవ్రంగా దెబ్బతిన్న ఏడు మండలాల్లో ఈ బృందాలు పర్యటించి, ప్రజలకు సహాయ సహకారాలను అందిస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఈ విలేఖరుల సమావేశంలో శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.