ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ కోడెల వ్యాఖ్యల వీడియో దృశ్యాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఖర్చు ఎక్కువైందంటూ ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయమై వైకాపా నేత అంబటి రాంబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్పీకర్ చేసినట్లుగా ఉన్న వ్యాఖ్యలు ఉన్న వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి ఒక టీవీ చానల్‌కు నోటీసు జారీ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తమకు ఇవ్వాలని ఎన్నికల ప్రదానాధికారి ఆ నోటీసులో ఆదేశించారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 11.40 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా స్పీకర్ అన్నట్లు ఒక చానల్‌లో ప్రసారమైంది. కాని తాను అలా అనలేదని స్పీకర్ గతంలోనే వివరణ ఇచ్చారు.