ఆంధ్రప్రదేశ్‌

రేషనలైజేషన్ నివేదిక అందాకే ఉపాధ్యాయుల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు, విద్యార్ధుల తల్లిదండ్రులు, ఇతర స్థానిక ప్రతినిధులను మరింత భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయంలో ఆయన గురువారం ఉదయం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి సమాచార, ప్రసార శాఖా మంత్రి పల్లె రఘునాధరెడ్డి సైతం పాల్గొన్నారు. పరీక్షకు మొత్తం 49,757 మంది హాజరయ్యారని అందులో 29,936 మంది ఉత్తీర్ణులయ్యారని బాలురు 59.99 శాతం పాసయ్యారని, బాలికలు 60.41 శాతం మంది పాసయ్యారని చెప్పారు. అనంతపురం జిల్లా 76.10 శాతం ఉత్తీర్ణత సాధించి తొలిస్థానంలో ఉందని చెప్పారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామని, కొన్ని చోట్ల సిసిటివిలను కూడా వినియోగించామని ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చూశామని అన్నారు. పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థను పాదుగొలిపే విధంగా స్కూల్ మేనేజిమెంట్ కమిటీలను నియమిస్తున్నామని వీటికి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామమని, 26వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతి నుండి ముగ్గురు సభ్యులకు స్కూల్ మేనేజిమెంట్ కమిటీలో చోటు ఉంటుందని అన్నారు. అలాగే ఎక్స్‌అఫిషియో సభ్యులు ఆరుగురు, కో ఆప్టెడ్ సభ్యులు ఇద్దరు ఉంటారని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో హెడ్మాస్టర్ కన్వీనర్‌గా ఉంటారని, ఒక అదనపు ఉపాధ్యాయుడు, వార్డు లేదా కౌన్సిలర్, అంగన్‌వాడీ వర్కర్, ఒక ఎఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని మంత్రి వివరించారు. ఉపాధ్యాయులను విఐపిలకు వ్యక్తిగత కార్యదర్శులుగా పెట్టుకోరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేస్తామని చెప్పారు. అలాగే రేషనలైజేషన్ కమిటీ నివేదిక అందిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీల సంగతి చూస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఐటి , ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ పనితీరు చాలా బాగుందని అన్నారు.