ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ఎడమ కాల్వ పనులు మేనాటికి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 14: పోలవరం ఎడమ కాలువ పనులు వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిపి గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిధుల సమస్య ఎదుర్కొంటున్నా, ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ నిధుల విడుదల్లో జాప్యం కారణంగా పూర్తి అయ్యేందుకు చాలా సంవత్సరాలు పట్టే వీలు ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ముందుగా నిధులను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినప్పుడు విమర్శించిన నేతలే ఇప్పుడు పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో వివిధ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వంశధార ప్రాజెక్టుకు నిధులు కేటాయించినప్పటికీ, వాటిని వినియోగించలేదనని ఆరోపించారు. పునరావాసం కల్పనలో జాప్యం జరిగిందన్నారు. వంశధార-2 ప్రాజెక్టుకు 424 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. తోటపల్లి ప్రాజెక్టును గురువారం ప్రారంభించామని, దీని వల్ల దాదాపు 1.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.