ఆంధ్రప్రదేశ్‌

చిల్లకల్లులో భార్యకు శీల పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జూలై 14: అక్రమ సంబంధం అనుమానంతో భార్యకు శీల పరీక్ష పెట్టిన ప్రబుద్ధుడి వైనం గురువారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జరిగింది. చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం చిల్లకల్లు - వైరా రోడ్డులోని కాలువల వెంట గుడిసెలు వేసుకొని జీవనం ఉంటున్న సత్రం బాలకృష్ణకు తన భార్య ప్రవర్తనపై అనుమానం కల్గింది. ఒక ఆటో డ్రైవర్‌తో కలిసి మాట్లాడుతోందని, వారి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. దీనిపై భార్య, భర్తల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పరాయి వ్యక్తితో ఎలాంటి అక్రమ సంబంధం లేదని నిరూపించుకోవాలంటే శీల పరీక్షకు సిద్ధం కావాలనగా ఆ ఇల్లాలు అందుకు సమ్మతించింది. ఈ విషయం కుల పెద్దల వద్దకు చేరి వారు కూడా దీనికి అంగీకరించారు. గురువారం తెల్లవారుజామున శీల పరీక్షకు సిద్ధమై నిప్పులో కాల్చిన రాడ్‌ను పట్టుకుంటే చేతులు కాలకపోతే శీలవతి అని, చేతులు కాలితే అక్రమ సంబంధం ఉన్నట్లుగా నిర్ణయించారు. అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని రాడ్‌ను నిప్పులో కాల్చడం మొదలు పెట్టగా కొందరు స్థానికులు గుర్తించి చిల్లకల్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని అరాచకాన్ని అడ్డుకున్నారు.