ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికో న్యాయమా?: సితారాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 14: సంచలనాత్మక, చారిత్రాత్మక తీర్పు ద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్ర రాష్ట్ర విభజన విషయంలో ఉపేక్షాభావం వహించటం భావ్యమా? న్యాయమా?.. అని ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం గురుదేవులు ప్రశ్నించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో గురువారం సీతారాం గురుదేవులు విలేఖర్లతో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయమన్నారు. అదే సమయంలో మూడేళ్ల క్రితం దేశ సర్వోన్నత చట్టసభల్లో తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపివేసి కొందరు ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన నాటి ప్రభుత్వం చేసిన దుర్మార్గం, ద్రోహం, అరాచకాలపై నాటి, నేటి అధికార, ప్రతిపక్ష పార్టీల బాధ్యతలను గుర్తించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భద్రతలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు భావ్యమా, న్యాయమా? అని ప్రశ్నించారు.