ఆంధ్రప్రదేశ్‌

హజ్‌యాత్ర దరఖాస్తుకు 17 తుది గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర సబ్సిడీని ఎత్తి వేయడంతోపాటు అపై జీఎస్‌టీ కూడా విధించడంతో యాత్రికులపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కేంద్ర కోటాను తెలంగాణ ముస్లింలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు.
దరఖాస్తు గడువు ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. సెంట్రల్ హజ్ కమిటీ నుంచి మూడువేల మంది హజ్‌యాత్ర చేసుకోటానికి ఆంధ్రప్రదేశ్‌కు కోటా లభించింది. గత ఏడాది ఈ కోటా భర్తీ కాలేదు. అయితే గత ఏడాది 500 మంది పైగా ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా హజ్ యాత్రకు వెళ్లారు. వాస్తవానికి ప్రైవేట్‌గా రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర కమిటీ ద్వారా వెళితే రూ. 2.50 లక్షల లోపు మాత్రమే ఖర్చు కాగలదని హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ తెలిపారు.