ఆంధ్రప్రదేశ్‌

విచారణలో నిజాయితీ లేదు: ధర్మాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 8: విశాఖ కుంభకోణం ముఖ్యమంత్రి సన్నిహితుల జోక్యంతోనే జరిగిందని, సిట్ విచారణ సక్రమంగా జరగలేదని, ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున గొంతెత్తితే నొక్కేయాలనే తన పేరు సిట్ నివేదికలో చేర్చారని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. భూ కుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదన్నారు. గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్ నివేదికలో తన పేరు రావడంపై అభ్యంతరం వ్యక్తపరిచారు. కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల పరిధిలో గల పనులను తనకు అంటగడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల్లో తన పట్ల అపోహలు సృష్టించి తన పేరును సిట్‌లో చేర్చి అసలు దొంగలు తప్పించుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కేబినేట్ మోసం చేస్తోందన్నారు. రికార్డుల టాంపరింగ్ జరిగిందన్న నెపంతోనే సిట్‌ను నియమిస్తే టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడ ఉందన్నారు. భూకుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు ప్రభుత్వం పెట్టలేకపోయిందని ప్రశ్నించారు. రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారని, ముఖ్యమంత్రి రెండు జీవోలు జారీ చేసారన్నారు. బీజేపీ శాసనసభ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఒక జీవోను రద్దు చేసారన్నారు. ఈ కుంభకోణం విశాఖలో దుమారం రేపడంతో ప్రతిపక్షనేత జగన్ కూడా మాట్లాడి సభాసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారన్నారు. ఇదే విషయమై అప్పట్లో మంత్రి నారాయణ మాట్లాడుతూ భూములు ఆక్రమించకున్న వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టామని సమాధానం ఇచ్చారన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెండింగ్‌లో ఉండగా భూములకు సంబంధించి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌కు వుడాకు ఎలా ఉత్తర్వులు ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోందని వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్దంగా రాజధాని భూసేకరణ చేశారన్నారు. సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్ధతి వద్దంటే చంద్రబాబు సీఆర్‌డీఏ రూల్స్ మార్చి స్విస్ ఛాలెంజ్ పద్ధతే అనుసరించారని వివరించారు. తప్పులు ఉంటే సరిదిద్దాలే తప్ప, ప్రభుత్వం భూకుంభకోణంలో అతిపెద్ద తప్పులు చేసేందుకు ప్రేరణ కలిగించేలా, ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రులే టాంపరింగ్ కేసులో ముఖ్య సూత్రధారులన్న విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు తన పేరును వినియోగించుకున్నారని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో 500 ఎకరాల సేకరణ వెనుక పెద్దవాళ్ళు ఎవరు? ఎంతమొత్తంలో చేతులుమారింది? వీటిని విచారణ వ్యవస్థలు తేల్చలేదన్నారు. ప్రతిపాదించిన 11 రోజుల వ్యవధిలోనే జీవో ఎలా బయటకు వచ్చిందని బాబు సర్కార్‌ను నిలదీసారు. సిట్ దర్యాప్తు ఈ విధంగా కొనసాగితే నిజాలు బయటకు వస్తాయా? రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందా? అంటూ సిట్ అధికారులను ప్రశ్నించారు. సిట్ విచారణలో ప్రజలు అడిగింది ఏమిటి? సి.ఎం. అదుపాజ్ఞలలో ఉన్న పోలీసులకే ఈ కేసులో చర్యలు తీసుకోమనే అధికారం ఇస్తారా..నిజానికి 1994లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబునాయుడు రెవెన్యూ మంత్రిగా నవంబర్‌లో జారీ చేసిన జీవోల ప్రకారమే ఇది జరిగిందన్నారు. అసైన్డ్ ల్యాండ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్‌సర్వీస్‌మెన్ల భూములకు సంబంధించి ఆ జీవో మీ ఆదేశాల మేరకే జారీ అయ్యిందని ధర్మాన గుర్తుచేసారు. 1977లో జారీ అయిన జీవో ప్రకారం ఏ భూములను విక్రయించే అధికారం లేదని, సిట్ రిపోర్టులో తప్పుడు పనులకు పాల్పడిన ప్రభుత్వంలోని పెద్దలు ఎవరో ఎందుకు తేల్చలేదని పలు ప్రశ్నలు ధర్మాన ముఖ్యమంత్రికి సంధించారు.