ఆంధ్రప్రదేశ్‌

కోడికత్తి డ్రామా ఫ్లాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 12: ప్రతిపక్ష నేత జగన్ ఆడిన కోడికత్తి డ్రామా అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిడారి శ్రవణ్‌తో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. జగన్ సోమవారం నుంచి రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రకు రాష్ట్రప్రభుత్వం నుంచి గట్టి భద్రతా ఏర్పాట్లు కల్పించామన్నారు. కోడికత్తి డ్రామాతో 17 రోజులు జగన్ విశ్రాంతి తీసుకున్నారని, మనలాంటి వారమైతే ఆ గాయానికి ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్నా సరిపోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేక ఎయిర్‌పోర్ట్‌లో తన కుమారుడిపై దాడిచేయించిదని జగన్ తల్లి విజయమ్మ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీకి వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వ ఆధీనంలోనే ఎయిర్‌పోర్టు ఉందన్న విషయాన్ని విజయమ్మ గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదన్న జగన్ మళ్లీ తనపాదయాత్రకు రక్షణ కల్పించాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. హైకోర్టు కూడా జగన్ వైఖరిపై మొట్టికాయలు వేసిందని, దాడి జరిగిన చోట స్థానికంగా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గాయమయ్యాక విశాఖలో నవ్వుకుంటూ విమానం ఎక్కిన జగన్ హైదరాబాద్ వెళ్లాక దిగాలుగా ఆసుపత్రిలో పడుకున్న తీరును రాష్ట్రప్రజలంతా గమనించారన్నారు. మూడు సెంటీమీటర్ల మేర గాయమైతే రక్తం కారుకుంటూ జగన్ విమానం ఎలా ఎక్కారన్నారు. జగన్ అనుచరుడు శ్రీను దాడి జరిగిన రెండు గంటల అనంతరం కోడికత్తిని పోలీసులకు అప్పగించారని, సిఐఎస్‌ఎఫ్ రిపోర్టులో కూడా ఇదే ఉందని ఆనందబాబు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిచెందాక విజయమ్మ, జగన్ ప్రజల సానుభూతి కోసం ప్రయత్నించారని విమర్శించారు. సానుభూతి ఒక్కసారి మాత్రమే వస్తుందన్న విషయాన్ని వీరు గుర్తెరగాలని హితవుపలికారు. తెలుగుదేశం పార్టీకి దాడులు చేయించే నేరచరిత్ర లేదని, నేరచరిత్ర అంతా రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డిలదేనని దుయ్యబట్టారు. జగన్‌పై దాడిచేసిన శ్రీనివాస్ తాను జగన్ అభిమానినని, ఆయన సీఎం కావాలని కలలు కంటున్నానని, సానుభూతి కోసమే దాడిచేశానని స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చాడని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని డీజీపీ వెల్లడిస్తే వైసీపీ నాయకులు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కోడికత్తి డ్రామాను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించారని పధకం పన్నారని, అలాంటివేమీ ఫలించకపోవడంతో రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆనందబాబు మండిపడ్డారు. జగన్‌కు ఏ వ్యవస్థమీదా నమ్మకం లేదని, తాను, తన ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా, ప్రజా సమస్యలపై చర్చ జరగనీయకుండా వ్యవహరిస్తున్న దేశంలోనే ఏకైక ప్రతిపక్ష నేత జగన్ అని మంత్రి ఆనందబాబు విమర్శించారు.
చిత్రం..విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆనందబాబు, పక్కన మంత్రి కిడారి శ్రవణ్