ఆంధ్రప్రదేశ్‌

తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: ప్రకృతి వ్యవసాయం, రాష్ట్రంలో పంటల సాగు తదితర అంశాలపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను ఆధ్యయనం చేసేందుకు త్వరలో ఇండోనేషియా మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు చెప్పారు. బంగాళాఖాతంలో తుపాను కదలికలను ముందుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయం, పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బంగాళాఖాతంలో తుపాను కదలికలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగిన సూచనలివ్వాలని కోరారు. వాస్తవ అంచనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వాస్తవ అంచనాలు గుర్తించాలని వివరించారు. తిత్లీ తుపాను కదలికలు ముందుగా పసికట్టగలిగామని ఎక్కడ తీరం దాటుతుందో ముందే తెలియజేశామన్నారు. విశ్వసనీయత మేరకే సమాచారం ఉండాలన్నారు. గత రెండేళ్లలో వర్ష పాతం లోటు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందిలేకుండా చేశామన్నారు. వ్యవసాయ అనుబంధరంగాల రాబడి తగ్గకుండా కాపాడామన్నారు. ఈ ఏడాది 34 శాతం లోటు ఉంది.. అయినా అనుబంధ రంగాల రాబడిని పెంచుకోవాలని సూచించారు. ఖరీఫ్‌లో తగ్గిన సేద్యపు విస్తీర్ణాన్ని రబీలో భర్తీ చేయాలన్నారు. ఈ ఏడాది రబీలో 3లక్షల హెక్టార్లలో విస్తీర్ణం పెంచాలని నిర్దేశించారు. రాయితీ విత్తనాల సరఫరాను ముమ్మరం చేయాలన్నారు. పంట రుణాలను వేగవంతంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. జొన్న, మొక్కజొన్నపై కత్తెర పురుగును నియంత్రించాలని ఇతర ప్రాంతాల నుంచి ఏ తెగుళ్లు రాష్ట్రానికి విస్తరించ రాదన్నారు. తెగుళ్ల నివారణపై ముందస్తు చర్యల వల్ల సత్ఫలితాలు సాధించ వచ్చని, తెగుళ్లపై రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. గత నాలుగేళ్లలో ఉద్యానవనరంగం రాబడి రెండున్నర రెట్లు పెరిగిందని, సూక్ష్మసేద్యం విస్తీర్ణం కోటి ఎకరాలకు పెరగాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల రాబడి ప్రతి ఐదేళ్లకు రెట్టింపు కావాల్సి ఉందన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం ఇతర దేశాలకు ఒక నమూనాగా మారింది.. జెడ్‌బీఎన్‌ఎఫ్ ఆధ్యయనానికి ఇండోనేషియా మంత్రి వస్తున్నట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూ, డెంగీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మందుల కొరతలేకుండా శ్రద్ధ వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రిస్మస్ పండుగ లోగా ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతల తవ్వకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పంటకుంటల తవ్వకం రాయలసీమ జిల్లాకు ఊరట కలిగిస్తోందని అదే స్ఫూర్తితో ఇంకుడుగుంతలు ఏర్పాటు కావాలన్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి అన్ని పంచాయతీలు స్వచ్ఛగ్రామాలుగా రూపొందాలని ఓడీఎఫ్ తరహాలోనే ఓడీఎఫ్ ప్లస్ విజయవంతం చేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. శివారు ప్రాంతాల్లో ఉన్న ముళ్లకంపలను తొలగించి ప్రతి గ్రామంలో పచ్చదనం పెంచాలని నిర్దేశించారు. గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారితే అంటువ్యాధుల బెడద ఉండదన్నారు. 48 రోజుల్లో అన్ని గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పన పూర్తి కావాలని ఆదేశించారు. ఈ ఏడాది నరేగా నిధులు పూర్తిగా సద్వినియోగం చేయాలన్నారు. వచ్చే ఏడాది నిధులకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
కోటి ఎకరాల్లో సూక్ష్మసేద్యం
రాష్ట్రంలో ఐదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో కోటి ఎకరాల్లో సూక్ష్మసేద్యానికి సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. ఈ విషయమై మైక్రో ఇరిగేషన్ కంపెనీల సీఈఒలతో సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ ఏడాది 8.75 లక్షల ఎకరాలు, వచ్చే ఏడాది 12.5 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం సాగు చేయాలని నిర్ణయించామన్నారు. జలవనరుల ఆదా, పెట్టుబడి వ్యయం తగ్గించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించటంపై కంపెనీలు దృష్టి సారించాలన్నారు. సూక్ష్మ సేద్యానికి ఉపయోగించే పైపులు, పరికరాలు కనీసం పదేళ్లకు పైగా మన్నిక ఉండేలా తయారు చేయాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా సూక్ష్మసేద్యం విస్తరణకు అనుసరిస్తున్న కార్యాచరణను సీఈఒలకు వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు 5లక్షల 62వేల 355 హెక్టార్లలో అదనంగా సూక్ష్మసేద్యం సాగుచేశామని, దీంతో రాష్ట్రంలో 11.25 హెక్టార్ల భూమిలో ఈ తరహా సేద్యం జరుగుతోందని చెప్పారు. స్ప్రింక్లర్ల ద్వారా సాగు చేసే కంటే డ్రిప్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైతులపై భారం తగ్గించేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సూచించారు. కోటి ఎకరాల్లో సూక్ష్మసేద్యం చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలన్నారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంతో సూక్ష్మ సేద్యాన్ని అనుసంధానించేందుకు ప్రయత్నించాలని నిర్దేశించారు. మైక్రో ఇరిగేషన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాథాన్యత ఇవ్వాలన్నారు. సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, అదనపు కార్యదర్శి ఏవీ రాజవౌళి, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, చిరంజీవి చౌదరి తదితరలు పాల్గొన్నారు.