ఆంధ్రప్రదేశ్‌

నా జీవితం తెరచిన పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ఈ నెల 25న ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతక ముందు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన తాను రాసిన పుస్తకానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. 130, 140 పేజీలు గల ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుందన్నారు. ఈ నెల 25 గాంధీనగర్, శ్రీరామ ఫంక్షన్ హాలులో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎం గోపాలకృష్ణ, మాజీ చీఫ్ సెక్రటరీలు అజయ్ కళ్లం, వీ రామశర్మ, హన్స్ ఇండియా ఎటిటర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ పుస్తకాలను విభజన సమయంలో రాష్ట్రం కోసం పోరాటం చేసిన అధికారులు చందా ఖాన్, మాజీ చీఫ్ సెక్రటరీ టూరిజం మురళిసాగర్, మాజీ అడిషినల్ కమిషనర్ లేబర్ డిపార్ట్‌మెంట్‌కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. విభజన సమస్యలు, పరిష్కారాలపై పలు అంశాలు, తన ఉద్యోగ వృత్తిలో తనను వేధించిన వ్యక్తులు గురించి పుస్తకంలో పొందుపర్చానని, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు, రాజధాని తరలింపు వంటి అంశాలు పుస్తకంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక గురించి మాట్లాడుతూ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అని, వీరిద్దరి కలయిక ప్రజలు తెలుసుకుని రాబోయే రోజుల్లో చక్కని తీర్పుతో తిరుగులేని సమాధానం చెప్పగలరని కృష్ణారావు అన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ఐవైఆర్ కృష్ణారావు