ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్‌పై బీజేపీ కొత్త నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆర్కా లీజర్ కంపెనీని తెరమీదకు తీసుకువచ్చి కొత్త నాటకానికి బీజేపీ తెరతీసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హయ్ ల్యాండ్ తమదేనని, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటూ హైకోర్టుకు ఆర్కా లీజర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ చైర్మన్ చెప్పడాన్ని ఆయన కొట్టేశారు. 2004లో హాయ్‌లాండ్‌లోని కొంత భాగాన్ని ఆర్కా లీజర్‌కు బదిలీ చేశారని గుర్తు చేశారు. హాయ్‌లాండ్‌లోని 98 శాతం వాటా అగ్రిగోల్డ్ వద్ద ఉందని స్పష్టం చేశారు. రెండూ ఒకే గ్రూపు కంపెనీలేనని గుర్తు చేశారు. బీజేపీ నేతలు తామే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయగలమన్న విధంగా ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్ముడు పోకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారన్నారు. డిపాజిటర్లు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్‌కు 30 వేల రూపాయల ఆస్తులు ఉన్నాయని, వైకాపా ప్రచారం చేస్తున్నదని, దానిలో 15 శాతం చెల్లిస్తే, డిపాజిటర్లందరికీ చెల్లింపులు చేస్తామన్నారు. సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు 2312.50 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. విద్యుత్ పరికరాల కోసం మరో 3521 రూపాయలు ఖర్చు చేశామని వివరించారు.
తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయంపై ఇప్పటికే జగన్ మూడు రేట్లు చెప్పారని ఎద్దేవా చేశారు. సేవ్ ఆంధ్ర పేరుతో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణంలో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజం కాదన్నారు. రాజధానిలో భూములు మొదటి సారి అమ్ముకుంటే క్యాపిటల్ గైయిన్ కింద మినహాయింపు ఇచ్చారన్నారు. 2012 ఏప్రిల్ నుంచి 2014 వరకూ గుజరాత్ ప్రభుత్వ ఖర్చుతో మోదీ ప్రత్యేక విమానంలో దేశం అంతా తిరగలేదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 160 నుంచి 175 సీట్లు మాత్రమే వస్తాయని, ఇంకా తగ్గే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుటుంబరావు