ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ పంపిణీలో ఎస్‌పీడీసీఎల్‌కు ప్రపంచ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: విద్యుత్ పంపిణీ రంగంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ గుర్తింపు సాధించాయి. ఇటలీలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 6వ యూరోపియన్ యూనియన్- ఇండియన్ స్మార్ట్‌గ్రిడ్ వర్క్‌షాప్‌కు హాజరు కావాల్సిందిగా ఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయక్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. యూరోపియన్ దేశాల నుంచి అతి కొద్దిమంది హాజరయ్యే ఈ సదస్సుకు ఆహ్వానం అందటం పట్ల ఇంధన వనరులశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్‌ను అభినందించారు. ఇంధన పొదుపు, విద్యుత్ పంపిణీలో ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో వందకు పైగా ప్రతిష్టాత్మక అవార్డులు సాధించటంతో పాటు ప్రపంచ దేశాల సదస్సుకు ఎస్పీడీసీఎల్ ఎంపిక కావటం విద్యుత్‌రంగం ప్రాధాన్యతకు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించటంతో పాటు రాష్టవ్య్రాప్తంగా కాలుష్య రహితంగా వీటిని అమలు చేయాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. దశల వారీగా లక్ష వాహనాలను అందించేందుకు సంస్థతో అవగాహనా ఒప్పందం కుదిరిందని వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఇందులో భాగంగా ఎన్టీఆర్ జలసిరికి ఎస్పీడీసీఎల్ 17520 సౌర విద్యుత్ పంపుసెట్లను అందించిందని చెప్పారు. దశల వారీగా రాష్ట్రంలో 17లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఈఈఎస్‌ఎల్ సంస్థ 20వేల మీటర్లు పంపిణీ చేస్తుందన్నారు.
ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ఉదయ్ స్కీం కింద ఎస్పీడీసీఎల్ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును సాధించిందని, ఈపీడీసీఎల్ రెండు గ్రీన్ గ్రిడ్ అవార్డులతో పాటు, నిర్వహణ సామర్థ్యంలో మరో అవార్డును సొంతం చేసుకుందని వెల్లడించారు. ఇంధన రంగంలో మరో అడుగు ముందుకేసి గోల్డెన్ పీకాక్ అవార్డు సాధించే దిశగా ఏపీట్రాన్స్‌కో వినూత్న విధానాలను అవలంబించనున్నట్లు చెప్పారు. విద్యుత్‌రంగ సలహాదారు కె రంగనాధం, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తదితరులు ప్రపంచ గుర్తింపు సాధించిన ఎస్పీడీసీఎల్ సీఎండీని అభినందించారు.
చిత్రం..ఎంఎం నాయక్