ఆంధ్రప్రదేశ్‌

రక్షణ రంగ పరిశోధనల్లో భారత్-సింగపూర్ పరస్పర సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: రక్షణ రంగ పరిశోధనలు, అభివృద్ధిలో భారత్ సింగపూర్ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. సింగపూర్ ఇండియా మారీటైం బైలేటరల్ ఎక్సర్‌సైజ్ (సింబెక్స్)లో భాగంగా తూర్పు తీరంలో మంగళవారం ఇరు దేశాల రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, ఎంజీ ఏంజ్ హేన్ మూడవ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా రక్షణ రంగంలో పరిశోధనలు, విన్యాసాలు విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరిగాయి. అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భారత్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఇరుదేశాల నడుమ నౌకావాణిజ్య భద్రత, కౌంటర్ టెర్రరిజం అంశాల్లో సంయుక్తంగా ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. అలాగే ఇండియా, సింగపూర్ డిఫెన్స్ టెక్నాలజీ స్టీరింగ్ కమిటీ, ఇండియా సింగపూర్ డిఫెన్స్ ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇరు దేశాల రక్షణ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి సంయుక్తంగా కొనసాగించేందుకు మూడవ ద్వైపాక్షిక ఒప్పంద మార్గం చూపుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నౌకావాణిజ్యం, సముద్ర న్యాయ చట్టాల అనుకరణ, ఎయిర్ మిలటరీ ఎన్‌కౌంటర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు నిర్ణయించారు.
భారత్‌లో సింగపూర్ రక్షణ విభాగానికి శిక్షణ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సింగపూర్ రక్షణ మంత్రి ఎంజీ ఏంజ్ హేన్ మాట్లాడుతూ సంయుక్త సైనిక, శిక్షణ విన్యాసాలకు అంగీకారం కుదిరిందన్నారు. 2017లో ముగిసిన ఒప్పందాలకు కొనసాగింపుగా 2018 ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. 2018లో సింగపూర్ సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ షాంగ్రీలాలో చేసిన ప్రసంగాన్ని గుర్తు చేశారు. ఇండోపసిఫిక్ రీజియన్‌లో సంబంధాలను విస్తరింపచేయాల్సి ఉందన్నారు. పలు సందర్భాల్లో భారత్‌ను సింగపూర్ బలపరిచిందని, థాయ్‌లాండ్‌తో త్రైపాక్షిక విన్యాసాలు సాగించిందని గుర్తు చేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రక్షణ దళాల్లో మహిళలకు షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కీలక రక్షణ విభాగాల్లో సైతం వీరికి ప్రవేశం కల్పించే యోచన ఉందన్నారు.

చిత్రం..సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న భారత్, సింగపూర్ రక్షణ మంత్రులు
నిర్మలా సీతారామన్, ఎంజీ ఏంజ్ హేన్