ఆంధ్రప్రదేశ్‌

నీతి ఆయోగ్ లేఖ కేంథ్రానికి చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 6: వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇచ్చిన 350 కోట్ల రూపాయలు వెనక్కు తీసుకోవడం నూటికి నూరుశాతం కక్షపూరితమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) ఇవ్వనందునే నిధులు నిలిపివేశామన్న కేంద్రప్రభుత్వ వాదనకు నీతి ఆయోగ్ తాజా లేఖ చెంపపెట్టు వంటిదని అన్నారు. గురువారం గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కంభంపాటి మాట్లాడుతూ రాష్ట్రానికి కేటాయించిన నిధుల వినియోగానికి సంబంధించిన యూసీలు నిర్దేశిత విధానంలోనే అందినా నిధులు నిలిపివేసినట్లు నీతి ఆయోగ్ పేర్కొందన్నారు. వెనక్కు తీసుకున్న నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించిందన్నారు. ఈ ఆదేశాలు ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్రంలోని పెద్దలకు మింగుడుపడటం లేదన్నారు. విభజన హామీలను అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ వాటిని గాలికొదిలేసి, రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా పట్టించుకోకపోగా, అవమానించేలా వ్యవహరించారన్నారు. రాష్ట్ర హక్కులు, హామీలపై నిలదీసిన ముఖ్యమంత్రిపై కక్షగట్టారని, 947 కోట్లకు సంబంధించిన యూసీలు ఇప్పటికే సమర్పించినప్పటికీ కుంటిసాకులు చెప్తూ కక్షసాధింపు ధోరణికి ప్రధాని మోదీ పాల్పడ్డారన్నారు. విభజన హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణలు ప్రజలకు క్షమాపణతో పాటు, నీతి అయోగ్ లేఖపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలైన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి విషయాల్లో కూడా కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని,రాజకీయ కారణాలతో తప్పించుకుంటోందని కంభంపాటి ఆరోపించారు.