ఆంధ్రప్రదేశ్‌

ఏఎస్‌పీ సిన్హా మృతి సాగునీటి రంగానికి తీరనిలోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్ ఏఎస్‌పి సిన్హా మృతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సాగునీటి రంగానికి తీరనిలోటని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తీవ్ర అనారోగ్యంతో సిన్హా చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. గురువారం విజయవాడోని జలవనరుల శాఖ కార్యాలయంలో రాష్ట్ర సాగునీటి సంఘాల ప్రతినిధులతో కలిసి సిన్హా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ సిన్హా కేంద్ర జలమండలి సీనియర్ చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తూ గత ఏడాది సెప్టెంబర్ 19న కేఆర్‌ఎంబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆరోగ్యం సహకరించకపోయినా సమర్థవంతంగా ఆఖరి క్షణం వరకు బాధ్యతలు నిర్వహిస్తూ ఆయకట్టులోని రైతాంగానికి నీరు అందటానికి తనవంతు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.