ఆంధ్రప్రదేశ్‌

ఇంధనశాఖకు రెండు స్కోచ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: ఇంధనశాఖ మరో రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే 106 అవార్డులను కైవసం చేసుకున్న ఇంధన శాఖ రెండు స్కోచ్ అవార్డులను దక్కించుకోవడం విశేషం. విద్యుత్ ఉత్పత్తిలోనూ, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినందుకు స్కోచ్ సిల్వర్ అవార్డును ఎనర్జీ కేటగిరిలో ఏపీజెన్‌కో దక్కించుకుంది. ఢిల్లో ఈ నెల 5న జరిగిన కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్ జి.సత్యనారాయణ రాజు అందుకున్నారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లీడర్‌షిప్ ఫర్ ఎనర్జీ కేటగిరీ కింద స్కోచ్ గోల్డ్ అవార్డుతోపాటు, ఆర్డర్ ఆఫ్ మెరిట్ కేటగిరి కింద దేశంలోని 20 ఎనర్జీ ప్రాజెక్టుల్లో క్వాలిఫై అయినందుకు మరో పురస్కారం వచ్చింది. ఆ సంస్థ ఎండీ ఆదిశేషు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఏపీజెన్‌కో సీఎండీ విజయానంద్, మంత్రి కళా వెంకటరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ అభినందించారు.