ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో 15 నుంచి బీకేఎంయూ జాతీయ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: తిరుపతిలో ఈ నెల 15వ తేదీ నుంచి భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) జాతీయ 14వ మహాసభలు, స్వర్ణోత్సవ మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 15న 25వేల వ్యవసాయ కార్మికులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌లు తెలిపారు. విజయవాడ దాసరి భవన్‌లో గురువారం బీజేఎంయూ జాతీయ మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సభలు జరుగుతాయన్నారు.