ఆంధ్రప్రదేశ్‌

తీర ప్రాంతాల పరిరక్షణకు ఏపీసీఆర్‌జెడ్‌ఎంఏ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో తీర ప్రాంతాల పరిరక్షణకు ఏపీ కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌జెడ్‌ఎంఏ)ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. మూడేళ్ల పాటు ఈ అథారిటీ పనిచేయనుంది. ఈమేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని తీర ప్రాంత పరిరక్షణ, మత్స్యకారుల రక్షణ, వారి జీవనోపాధి, కాలుష్య కారణ పరిశ్రమల నుంచి వ్యర్థాలు సముద్ర జలాల్లోకి రాకుండా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అడ్డుకట్ట వేస్తుంది.
రాష్ట్ర పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షునిగా, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారి సభ్య కార్యదర్శిగా ఈ అథారిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిరక్షణలో భాగంగా ముసాయిదా రూపకల్పనకు వివిధ శాఖలతో చర్చించింది. ఈ ముసాయిదాపై అభిప్రాయ సేకరణకు 9 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. ముసాయిదాపై మరోసారి చర్చించి సవరణల అనంతరం కేంద్ర పర్యావరణ శాఖకు పంపి, తుది ఆమోదం పొందాల్సి ఉంది.