ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రా గ్రూపుల పటిషాఠనికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: డ్వాక్రా మహిళల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహిళలు ఆర్థికంగా శక్తివంతులైతే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏమేం అవకాశాలున్నాయో.. వాటినన్నింటినీ సద్వినియోగం చేసుకునేలా పథక రచన చేస్తోంది. ఇందుకు అవసరమైన శిక్షణతో పాటు ఆర్థికంగా చేయూతనివ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. చౌక ధరల్లో జనరిక్ మెడిసిన్ స్టోర్ల నిర్వహణలో డ్వాక్రా సంఘాల మహిళల్ని కూడా భాగస్వాముల్ని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 150 మెడికల్ స్టోర్లను డ్వాక్రా సంఘాలకు కేటాయించింది. తూర్పుగోదావరి జిల్లాలో 8, కృష్ణాజిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 6 మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేయబోతోంది. మిగిలిన జిల్లాల్లో కనీసం 15 వంతున మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. దుకాణాల ఏర్పాటు, షాపుల యజమానులతో ఒప్పందాలు, లైసెన్సు తెచ్చుకోవడం, స్టోర్ల నిర్వహణకు సంబంధించి మహిళలకు శిక్షణ తదితర కార్యక్రమాలన్నీ వేగవంతంగా జరిగిపోతున్నాయి.
వీలైనంత త్వరగా ఈ మెడికల్ స్టోర్లు ప్రారంభించడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ మెడికల్ స్టోర్ల ద్వారా ఏడాదికి కనీసం 333 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే జరిగితే డ్వాక్రా సంఘాల పంట పండినట్టే. కాగా గొర్రెల పెంపకంలో డ్వాక్రా మహిళలకు చేయూతనివ్వడం ద్వారా వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది డ్వాక్రా సంఘాల మహిళల్ని ఈ పథకంలో భాగం చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలోనూ గొర్రెల పెంపకానికి అనువుగా ఉండే మండలాలను ఎంపిక చేసి, ఆయా ప్రాంతాల్లో స్థానిక డ్వాక్రా మహిళల్ని భాగస్వాముల్ని చేయబోతోంది. ప్రతి జిల్లాకు కనీసం ఐదు నుంచి 10వేల మంది డ్వాక్రా మహిళల్ని ఈ పథకంలో చేర్చబోతోంది. ఎంపిక చేసిన డ్వాక్రా సంఘాల మహిళలకు గొర్రెల పంపిణీతో పాటు వాటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు, ఇన్స్యూరెన్స్ వంటి అంశాలపై శిక్షణ కూడా ఇస్తున్నారు. లక్ష కుటుంబాలకు ప్రయోజనం చేకూరే ఈ పథకానికి డ్వాక్రా సంఘాల మహిళల నుంచి ఇప్పటికే భారీ స్పందన లభిస్తోంది. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలు కల్పించే మరో పథకం డ్వాక్రా బజార్లు. రాష్ట్ర వ్యాప్తంగా వంద డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఆహార పదార్థాలను విక్రయించేందుకు ఏర్పాటు చేస్తున్న వేదికలే ఈ డ్వాక్రా బజార్లు. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే 50 డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ మరో 50 బజార్లు ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల్లో చదువుకున్న వాళ్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించుకునేలా బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనివల్ల బ్యాంక్ ఖాతాదారులకు ఖర్చులు తగ్గడంతో పాటు డ్వాక్రా మహిళలకు ఆదాయం కూడా సమకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేసుకోలేని బ్యాంకులకు ఈ బిజినెస్ కరస్పాండెంట్ల వల్ల లాభం ఉండటంతో వీరి నియామకానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది మహిళల్ని బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించడానికి రంగం సిద్ధమవుతోంది.
డ్వాక్రా సంఘాల మహిళలు వ్యాపారులుగా మారేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులతో రిటైల్ బిజినెస్‌కు రంగం సిద్ధం చేస్తోంది. డ్వాక్రా మహిళలతో కిరాణా దుకాణాలు పెట్టించబోతోంది. ఈ దుకాణాల్లో డ్వాక్రా ఉత్పత్తులతో పాటు, ఇతర కంపెనీ ప్రొడక్ట్స్ కూడా అమ్మే ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఎఫ్‌ఎంసిజి డిస్ట్రిబ్యూటర్లతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుని, డ్వాక్రా దుకాణాలకు సరుకులు అందజేసేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే డ్వాక్రా ఉత్పత్తులను ఇతర రిటైల్ దుకాణాలు, మాల్స్ కూడా కొనుగోలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించబోతోంది. మండలానికి 30 దుకాణాల వంతున రాష్ట్ర వ్యాప్తంగా 150 మండలాల్లో డ్వాక్రా సంఘాలతో రిటైల్ దుకాణాలు తెరిపించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇదే జరిగితే నాలుగు వేలకు పైగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చినట్లవుతుంది. మహిళల్ని స్వయం సమృద్ధి సాధించేలా చేయడం ద్వారా వారితో పాటు వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.