ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్టాత్మకంగా పట్టణ గృహ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 11: ప్రభుత్వం చేపట్టిన పట్టణ గృహనిర్మాణ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులు శ్రద్ధతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. మంగళవారం అర్బన్ హౌసింగ్‌పై సచివాలయంలో అధికారులు, కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల గృహనిర్మాణ పథకాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పనుల్లో పురోగతి సంతృప్తి కరంగా ఉన్నప్పటికీ ఆశించిన లక్ష్యాలను చేరుకోలేదన్నారు. లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తిచేయాలని సూచించారు. దరఖాస్తులను వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు. లబ్ధిదారుల వాటా త్వరగా చెల్లించేలా చూడాలని ఆర్థికశాఖ నుంచి నిధుల కేటాయింపులో జాప్యం చేయద్దని ఆదేశించారు. పట్టణ గృహనిర్మాణంపై పర్యవేక్షణ బృందాలను నియమించి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మంజూరైన గృహాలకు వెంటనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని, గృహనిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించాలని నిర్దేశించారు. భూములు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికను జిల్లా స్థాయి కమిటీలు నిర్ధారించాలని స్పష్టం చేశారు. గ్రౌండ్ అయిన ప్రతి ప్లాట్‌కు లబ్ధిదారుడిని ఎంపిక ఏయాలని అప్పుడే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని తెలిపారు.