ఆంధ్రప్రదేశ్‌

బాబుపై వ్యతిరేకతకు తెలంగాణ ఎన్నికలే నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 12: టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తెలంగాణ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి చంద్రబాబు చేసిన ప్రచారమే కారణమన్నారు. బాబు మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదన్నారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతే హరికృష్ణ కుమార్తె సుహాసిని ఓటమికి కారణమైందన్నారు. వచ్చే ఏడాది ఆంధ్రాలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడం తధ్యమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే వాటిని చంద్రబాబు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. గత యూపీఏ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చేందుకు ప్రధాని శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వల్లూరి జయప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, సినీనటి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.