ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో భ్రష్టుపట్టిన ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం బ్రష్టుపట్టిందని , కుటుంబపాలనకు రాష్ట్ర ప్రజలు స్వస్తి పలకాలని మాజీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం పిలుపునిచ్చారు. ‘మనకోసం మనం’ ఆధ్వర్యంలో నెల్లూరులో గురువారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు నిర్వహించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్నొన్న అజయ్‌కల్లాం మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజుగా కొనసాగుతూ గ్రామస్వరాజ్‌కు స్వస్తిపలికారన్నారు. పార్టీ ఫిరాయించిన 23మంది ఎమ్మెల్యేపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందులో నలుగురికి మంత్రి పదవులు అందచేసిన ఘనత చంద్రబాబునాయుడు ప్రభుత్వానికే దక్కిందన్నారు. హైటెక్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఇప్పుడు అమరావతి పేరుతో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద రైతుల నుండి వేలాది ఎకరాల భూములు తీసుకొని కార్పొరేట్ శక్తులకు మార్కెట్ రేటు కన్నా తక్కువకు కేటాయిస్తూ వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. లక్షలాది కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో వేలాది కోట్లు వెచ్చించి రాజధాని భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ అనుమతి లేకుండా రూ.27వేల కోట్లు ఖర్చు చేశారని, రూ.60వేల కోట్లు రుణాలు చేశారని, ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఆర్‌టీఏ విశ్రాంత కమిషనర్ పి.అజయ్‌బాబు జెవివి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.