ఆంధ్రప్రదేశ్‌

16న పిన్నమనేని పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 13: పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ విశిష్ట పురస్కారాలకు ఈ ఏడాది ప్రముఖ ఫోరెన్సిక్ శాస్తవ్రేత్త డాక్టర్ గాంధీ పీసీ కాజా, ప్రముఖ రంగస్థల, జానపద కళాకారుడు, కళాతపస్వి కర్నాటి లక్ష్మీనరసయ్య ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు 27ఏళ్లుగా వార్షిక పురస్కారాలు అందిస్తున్నామని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ చదలవాడ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారాలను ఈనెల 16న సాయంత్రం విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో అందిస్తామని పేర్కొన్నారు. 1989లో ఏర్పాటైన తమ ఫౌండేషన్ సామాజిక, కళా రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు అందించి గౌరవించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్‌లో ఉంటూ విశిష్ట సేవలందిస్తున్న డా గాంధీ పీసీ కాజా అపరాధ పరిశోధన, సత్యశోధన రంగంలో దేశం మొత్తానికి మార్గదర్శిగా ఉన్నారని కొనియాడారు. 1965 నుండి జానపద కళారూపాల ప్రదర్శనకు, పరిరక్షణకు అవిరామంగా కృషి చేస్తున్న లక్ష్మీనరసయ్యకు ఫౌండేషన్ తరపున పురస్కారాన్ని అందించడం గర్వకారణంగా భావిస్తున్నామని వెల్లడించారు.