ఆంధ్రప్రదేశ్‌

హోదాను వ్యతిరేకించిన వారు గెలిస్తే సంబరాలా?: డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన కేసీఆర్ తెలంగాణాలో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేస్తారా అని శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేయడంలో తప్పులేదని, టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం, ఫ్లెక్సీలు కట్టి అభినందనలు తెలపడం, కేటీఆర్‌తో డిన్నర్‌లో పాల్గొనడం వంటి చర్యలు మాత్రం తగదని డొక్కా తప్పుబట్టారు. వారు అలా చేయడంలో అర్థమేమిటని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినప్పుడు కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. ప్రత్యేక హోదా అనేది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, సెంటిమెంట్ అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణాలో రాజకీయాలు చేయడం, వారు గెలిస్తే ఇక్కడ పండగ చేసుకోవడం ద్వారా వారి నైజం తెలుస్తోందన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి కేటీఆర్‌తో డిన్నర్‌కు హాజరయ్యారని, మిథున్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి అభినందనలు తెలిపారన్నారు. ఇటువంటి రాజకీయాలు మానుకోవాలన్నారు.