ఆంధ్రప్రదేశ్‌

అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: కోస్తాంధ్ర తీరానికి వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి గురువారం వాయుగుండం ప్రభావంపై సమీక్షించారు. పంటలకు సంబంధించి కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తూ, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు స్టేట్ కమాండ్ సెంటర్ నుంచి అధికారులు వాయుగుండం కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.