ఆంధ్రప్రదేశ్‌

21మంది డీఎస్పీలు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 13: రాష్ట్రంలో 21మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆర్‌పి ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఎక్కువ మందిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించడం గమనార్హం. శ్రీకాకుళం ఎస్‌డిపిఓ వి భీమారావు, అమలాపురం ఎస్‌డిపిఓ ఏవిఐ ప్రసన్నకుమార్, విశాఖపట్నం ట్రాఫిక్ ఏసీపీ కె ప్రభాకర్, తిరుపతి వెస్ట్ డీఎస్పీ టి కనకరాజు, నరసారావుపేట ఎస్‌డిపిఓ కె నాగేశ్వరరావు, విశాఖపట్నం క్రైం ఏసీపీ టి ఫల్గుణరావు, కందుకూరు ఎస్‌డిపిఓ కె ప్రకాశరావు, గుంటూరు అర్బన్ ఈస్ట్ డిఎస్పీ కె శ్రీనివాసులు, బాపట్ల ఎస్‌డిపిఓ డి గంగాధరం, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ బి సదాలక్ష్మీ, అనకాపల్లి ఎస్‌డిపిఓ కెవి రమణ, కర్నూలు ఎస్‌డిపిఓ ఎన్ యుగంధర్‌బాబు, గూడూరు ఎస్‌డిపిఓ వి శ్రీరామ బాబు, నెల్లూరు స్పెషల్ బ్రాంచి డిఎస్పీ ఎన్ కోటరెడ్డి మొత్తం 14మందిని మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా మరో ఏడుగురు డిఎస్పీలకు స్ధానంచలనం కలిగింది. తిరుపతి ఈస్ట్ డిఎస్పీ ఎం మునిరామయ్యను సిఐడికి బదిలీ చేశారు. విజయవాడ నార్త్ ఏసీపీ కె శ్రావణిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరిపాలనా విభాగానికి పంపారు. విశాఖపట్నం నార్త్ ఏసీపీ అర్జున్‌ను విజయనగరం పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా ఏసిబి డిఎస్పీగా పని చేస్తున్న టి ప్రభాకర్‌ను తిరుమల తిరుపతి దేవస్ధానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించారు. తిరుమల ఎస్‌డిపిఓ ఎన్ సుబ్బారావును చిత్తూరు స్పెషల్ బ్రాంచి డిఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న రామ్‌కుమార్‌ను నెల్లూరు స్పెషల్ బ్రాంచి డిఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.