ఆంధ్రప్రదేశ్‌

సకాలంలో సరఫరా చేయకపోతే బ్లాక్ లిస్టులో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: ఆదరణ-2కు సంబంధించిన పరికరాలు సకాలంలో సరఫరా చేయకపోతే ఆ డీలర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం ఆదరణ-2 పథకం అమలు తీరు, పరికరాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరికరాల సరఫరాకు టెండరు వేసిన వారు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఆదరణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందులో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. పనిముట్ల నాణ్యతలో రాజీలేకుండా వ్యవహరించాలన్నారు. ఈ పథకం అమలుకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపారు.