ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి అన్యాయం చేసినవారు గెలిస్తే సంబరాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: కుహానా మేధావులైన రిటైర్డ్ అధికారులు సేవ్ డెమెక్రసీ - సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ధర్మసూత్రాలు వల్లిస్తూ ప్రతిపక్ష నేత జగన్‌ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీడీపీని విమర్శిస్తున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. శుక్రవారం జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి దేవినేని మాట్లాడుతూ రిటైర్డ్ అధికారులు అజయ్‌కల్లం, లక్ష్మణ్‌రెడ్డిలకు జగన్ మీద అభిమానం ఉంటే ముసుగు తీసేసి కోడికత్తి పార్టీలో చేరి అవినీతిపరుడ్ని కాపాడవచ్చునన్నారు. అయితే తాము ఎప్పటికప్పుడు జగన్ నిజస్వరూపం ప్రజలకు వివరిస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చే రిటర్న్‌గిఫ్ట్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాటు తేలిపోయిందన్నారు. గత మూడు రోజులుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రతిపక్ష నాయకులు నోటికొచ్చినట్లు అడ్డూ అదుపు లేకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న కేసీఆర్, కేటీఆర్‌లకు వంతపాడుతూ వైఆస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటమే కాకుండా తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే ఏపీలో పటాసులు పేల్చుతున్నారన్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై అవిశ్వాస తీర్మానం వస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారన్నారు. ఢిల్లీలో ఆంధ్రాభవన్ వివాదం, రెండు రాష్ట్రాల పంపకాలకు సంబంధించి వివాదాలు, కృష్ణా, గోదావరి నదుల మధ్య వైరాన్ని కేంద్రం పరిష్కరించటం లేదన్నారు. అలాంటి వారికి ప్రతిపక్ష నేత జగన్ మద్దతు ఇస్తూ కేసీఆర్ గెలుపుపై జబ్బలు చరుచుకంటున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జగన్‌కి ప్రభుత్వం చేసిన తోటపల్లి ప్రాజెక్టు, వంశధార, నాగావళి నదుల అనుసంధానంపై పురోభివృద్ధి, పట్టిసీమ ద్వారా తీసుకొచ్చిన 260 టీఎంసీల నీళ్ళు, పురుషోత్తపట్నం ద్వారా విశాఖపట్నంకు ఇస్తున్న నీళ్లు, రాయలసీమలో శరవేగంగా గండికోట, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా ఇస్తున్న నీళ్లు కనిపించటం లేదన్నారు. పులివెందుల్లో పంటలకు నీళ్లు ఇవ్వడం ద్వారా 1000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకువచ్చామన్నారు.
నిత్యం హైదరాబాద్‌లో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకుంటూ, కేసీఆర్‌కు భయపడి వారితో కుమ్మక్కై తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని వదిలేసి కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఇక్కడికి వచ్చి కబుర్లు చెపుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకుండా అసెంబ్లీకి రాకుండా మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తూ మంత్రులను తిడుతున్నారన్నారు. పోలవరంను అడ్డుకోడానికి పలు కేసులను గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వేయిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికి 62 శాతం పూర్తి అయ్యాయని డీపీఆర్-2ను ఆమోదించి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరచాలన్నారు. ఎమ్మెల్సీ పీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ మా మిత్రుడు కేసీఆర్ గెలిచాడని జగన్ సంబరాలు చేసుకుంటున్నారని, ఏపీకి నష్టం చేసిన వ్యక్తులతో జగన్ దోస్తీ చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ టీడీపీ పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు. రిటైరయిన అధికారులు ఒక ముసుగులో మాట్లాడకుండా వైసీపీలో చేరి బహిరంగంగా మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారన్నారు.