ఆంధ్రప్రదేశ్‌

కాపుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, డిసెంబర్ 14: రాష్ట్రంలో కాపుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం ఆర్‌అండ్ బి విశ్రాంతి భవనంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. కాపుల సంక్షేమం, అభ్యున్నతికోసం తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతాపార్టీతో వైదొలిగినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజాదరణ పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం పనులు పూర్తయ్యాయన్నారు. చిత్తూరు జిల్లాలో పీలేరు, కడప జిల్లాలో రాయచోటిలలో పోలీస్ సబ్ డివిజన్‌లను ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.