ఆంధ్రప్రదేశ్‌

ప్రధాని మోదీకి జైలు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 16 : ప్రపంచంలో అతి శక్తివంతమైన భారత సైనిక రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జైలుకు వెళ్లక తప్పదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో సుప్రీం కోర్టుకు సరైన వివరాలు అందజేయకుండా తప్పుదోవ పట్టించిన బీజేపీ ప్ర భుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అ నంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఆ దివారం రఘువీరా విలేఖరులతో మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని మోదీ ముమ్మాటికీ దోషే అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని, దీనికి సమాధానం చెప్పాలని గత ఏడాది కాలంగా కోరుతున్నా మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హెచ్‌ఏఎల్ సంస్థ రూ. 560 కోట్లతో ఒక్కో యుద్ధ విమానం కొనుగోలు చేసి సైనిక రక్షణకు ఇచ్చారన్నారు. అలాంటి సంస్థకు ఇవ్వకుండా ప్రధాని మోదీ ముడుపులు తీసుకుని సైనిక రక్షణ రంగం కూడా అవినీతికి పాల్పడే విధంగా చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడకపోతే రాఫెల్ యుద్ధ విమానంపై ఎందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో రాఫెల్ గురించి తీర్పు వచ్చేంత వరకూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఏమాత్రం మాట్లాడకుండా ప్రస్తుతం నోరు విప్పడం సమంజసం కాదన్నారు. ఇకనైనా ప్రధాని మోదీ పార్లమెంటు సమావేశాలకు హాజరై వెంటనే సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కోర్టుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడిన వారెవరూ తప్పించుకోలేరన్నారు.
కోర్టు తీర్పును స్పీకర్ గౌరవించాలి
మడకశిర ఎమ్మెల్యేగా రెండో అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకా రం చేయించాలని సుప్రీం, హైకోర్టులు ఇ చ్చిన తీర్పును స్పీకర్ వెంటనే అమలు చే యాలని రఘువీరా కోరారు. కోర్టులో ఎ దురుదెబ్బకు గురైన ఈరన్న తన సొంత అభిప్రాయంతో రాజీనామా చేయలేదని, ఇతరుల ఒత్తిడికి గురై అలా వ్యవహరించారన్నారు.