ఆంధ్రప్రదేశ్‌

మనువాదంతో రాజ్యాంగానికి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: మనువాదంతో రాజ్యాంగానికి తీరని ముప్పు తప్పదని డాక్టర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు. విశాఖలో ఆదివారం జరిగిన కాపు, దళిత, ముస్లిం, మైనారిటీ ఐక్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షకులనే వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించారు. దళిత, మైనారిటీలపై మతోన్మాద శక్తుల దాడులు హింసాత్మకంగా మారాయని అన్నారు. మను వాదాన్ని తెరపైకి తెచ్చి రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలోనే మతోన్మాదులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యవేదిక తమ సత్తా చాటాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే నాయకులను ఎన్నుకోవాలన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ దళిత,కాపు, బీసీ, ముస్లిం, మైనారిటీలు ఐక్యవేదికగా ఏర్పాటు కావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ఏడు దశాబ్ధాలుగా అవమానాలు భరిస్తూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితమైన ఐక్యవేదిక వర్గాలు ఒక్కటి కావడం రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో ఐక్య వేదిక ప్రతినిధులు తమ వర్గాల అభ్యున్నతికి ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా సేవ చేయాలన్న తలంపు కలిగిన నాయకులను ఎన్నుకోవడం ద్వారా ఐక్యవేదిక పరిణితి చెందిన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించాలన్నారు.
చిత్రం..దళిత, కాపు, బీసీ, ముస్లిం, మైనార్టీ ఐక్యవేదిక సదస్సులో మాట్లాడుతున్న ప్రకాష్ అంబేద్కర్