ఆంధ్రప్రదేశ్‌

సాంకేతికతకు బానిసలు కావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, డిసెంబర్ 16: టెక్నాలజీని అవసరమైన మేరకే ఉపయోగించుకోవాలని, మానసిక ఆందోళనలకు గురికావద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు సూచించారు. కులం, మతం, ప్రాంతీయ భేదాలు తగవని హితోపదేశం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం జరిగిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు 100వ జన్మదిన వేడుకలకు ముఖ్యమంత్రి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరం గ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆదర్శవంతమై న జీవన విధానాన్ని కొనసాగించి నూరు వసంతాల వేడుకలు జరుపుకొంటున్న యడ్లపాటి వెంకట్రావు నేటితరానికి ఆదర్శనీయులన్నారు. 1975 నుండి యడ్లపాటి తనకు తెలుసునని, ఆయన రాజకీయ, రైతు ఆదర్శ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. జీవన విధానం, రైతు పక్షపాతం, నిబద్ధ రాజకీయ జీవితం యడ్లపాటి ఆయుష్షుకు కారణాలని చెప్పారు. యడ్లపాటి జీవితాంతం నమ్ముకున్న వర్గం రైతు వర్గమని, ఈ కారణంగానే రైతుపక్షపాతిగా ఆయన నిలిచారని చంద్రబాబు కొనియాడారు. దేశంలో వనరులు, మానవ సంపద పుష్టిగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రపంచ సాంకేతికత రంగంలో మొదటి నలుగురిలో ఏపీకీ చెందిన వారు ఒక్కరు ఉండటం గర్వకారణమన్నారు. కుటుంబ వ్యవస్థకు ఆదర్శవంతమైన మన దేశంలో మెకానికల్ జీవితాలు ఆనందంగా ఉండవని, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ మన సొంతం కావాలన్నారు. ఈక్రమంలో సంపదను సృష్టించడం ఎంతో అవసరమని చెప్పారు. విభజన సమయంలో కష్టాలలో ఉన్న రాష్ట్రంలో ప్రజల సహకారంతో ఆదర్శవంతమైన రాజధాని నిర్మాణానికి రైతులను భూములు అడిగితే ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలిచ్చారని గుర్తుచేశారు. రోడ్లు విస్తరణ, విద్యుత్ ఏర్పాటు, తాగునీరు కల్పించేందుకు ఆ ప్రాంతంలో 50వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటికే ఖర్చు చేశామని తెలిపారు. జీఎస్టీ, వ్యాట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతున్నప్పటికీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే మరింతగా అభివృద్ధి, ఆదాయం చేకూరాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల రుణామాఫీకి 24వేల కోట్ల రూపాయలు మూడు దశలగా ఇచ్చామని, తుదిదశ జనవరిలో చెల్లిస్తామని తెలిపారు. 90లక్షల మంది డ్వాక్రా సభ్యులకు రుణమాఫీ చేశామన్నారు. సమష్టి కృషితోనే మానవ వనరులతో సంపదను ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. వెనుకబడిన కులాలవారికి నందమూరి తారక రామారావు హయాంలోనే ఆదరణ, సహకారం అందటం ప్రారంభమైందన్నారు. పేదలకు 25లక్షల గృహాలు గ్రామీణ ప్రాంతాల వారికి 1.50 లక్షలు, పట్టణ వాసులకు 3లక్షల వరకు ఆర్థిక సాయం అందించి ఎన్టీఆర్ గృహాలు కట్టించి ఇస్తున్నామని ఆయన వివరించారు. 3సంవత్సరాలుగా వరుస తుఫాన్‌లతో ఉత్తర, దక్షిణ కోస్తాలు, కరవుకాటకాలతో రాయలసీమ అల్లాడాయన్నారు. నదుల అనుసంధానంతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యవౌతుందని గ్రహించి ఆ పనులు చేస్తున్నామన్నారు. క్రమంగా రైతులకు 4సంవత్సరాల కాలంలో ఆదాయం రెట్టింపు చేశామన్నారు. ప్రకృతి సేద్యం ఆరోగ్యానికి మంచిదని భావించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పొగాకు రైతులకు కేంద్రం అరకొర నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకుంటోందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రపంచంలోనే అత్యధికంగా టెక్నాలజీని ఉపయోగించుకునే రాష్ట్రాల్లో ఏపీ ముందుండేలా కృషి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు సెల్‌ఫోన్లలో నిక్షిప్తమయ్యేలా యాప్స్ రూపొందించామన్నారు. అయితే పూర్తిగా సాంకేతికపై ఆధారపడటం వల్ల మానసిక ఒత్తిళ్లు అధికమై మనుషులు పిచ్చివారుగా మారుతున్నారని, ఈనేపథ్యంలో అవసరమైన మేరకు మాత్రమే సెల్‌ఫోన్లు వాడుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈక్రమంలో ప్రజలు మొదట ఆరోగ్యం కాపాడుకునేందు కు శ్రద్ధ తీసుకోవాలని, సమైక్యత, ఆర్థిక పరిపుష్టి కలిగిన జీవితాలు అనుభవించాలని సూచించారు. తొ లుత ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళు లర్పించారు. అనంతరం యడ్లపాటి వెంకట్రావు జన్మదిన కేక్‌ను కట్ చేయించి పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసన సభాపతి కోడెల శివప్రసాద్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అయ్యన్నపాత్రుడు, మంత్రులు పు ల్లారావు, ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..యడ్లపాటి దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు