ఆంధ్రప్రదేశ్‌

నిజాయితీ నిరూపించుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 16 : తనకు జరిగిన అన్యాయం గురించి గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించి తన నిజాయితీని నిరూపించుకుంటానని ఎమ్మెల్యే ఈరన్న పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో ఎమ్మెల్యే ఈరన్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి విలేఖరులతో మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయగా ప్రజలు 15 వేల మెజార్టీతో గెలిపించారన్నారు. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పేస్వామి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అని ఫిర్యాదు చేయగా తిరస్కరించారన్నారు. దీంతో తిప్పేస్వామి చిన్న తప్పును పెద్దగా చేసి హైకోర్టుకు చూపించి దొడ్డిదారిన ఎమ్మెల్యే కావాలని ప్రయత్నాలు చేయడం న్యాయం కాదన్నారు. తన భార్య ఎన్నికలు జరగకముందే ఉద్యోగానికి రాజీనామా చేశారని స్పష్టం చేశారు. తనపై 2002లో కర్నాటక ప్రాంతంలో పెట్టినవి క్రిమినల్ కేసులు కాదన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి 2019లో జరిగే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
గత నాలుగున్నరేళ్లలో మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్సీ గండుమల తిప్పేస్వామి సహకారంతో ఎంతో కృషి చేశానన్నారు. కాగా దేశంలో ఎక్కడా రెండో అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించిన తీర్పులు ఇవ్వలేదన్నారు. అయితే ఉమ్మడి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను సమర్పించానని తెలిపారు. అక్రమ మార్గంలో పదవి కోసం పాకులాడుతున్న వారి గురించి ప్రజలకు వివరించి ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరనున్నట్లు ఎమ్మెల్యే ఈరన్న తెలిపారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈరన్న *పక్కన ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి