ఆంధ్రప్రదేశ్‌

వంచనపై గర్జన దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), డిసెంబర్ 16: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయడంలో ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంచించాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల గోపాలకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు విమర్శించారు. వీరి వైఖరికి నిరసనగా ఈ నెల 27న వైసీపీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘వంచనపై గర్జన దీక్ష’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంతో కేంద్రం, వాటిని సాధించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా నిర్వహించే దీక్షలో పార్టీ ముఖ్య నేతలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర వచ్చే ఏడాది జనవరి 9, 10 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుందని వెల్లడించారు. జగన్ పాదయాత్రకు సంఘీభావంగా జనవరి 5, 6, 7 తేదీల్లో రాష్టవ్య్రాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలతో మమేకమై పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వారు వివరించారు.