ఆంధ్రప్రదేశ్‌

పోలవరం నిర్మాణ పనుల్లో ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఆదివారం ప్రపంచ రికార్డు నమోదైంది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌లోని కాంక్రీటు పనుల్లో అరుదైన రికార్డును కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ నవయుగ సాధించింది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో విలేఖర్ల సమావేశంలో ప్రాజెక్టు సలహాదారు వీఎస్ రమేష్‌బాబు, కాంట్రాక్ట్ ఏజెన్సీ మేనేజర్ క్రాంతిలు మాట్లాడుతూ స్పిల్ ఛానల్, స్పిల్‌వేలోని కాంక్రీటులో 22 గంటల్లో 16వేల 368 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయడం జరిగిందన్నారు. శనివారం ఉదయం 8గంటల 45 నిమిషాలకు ప్రారంభించిన కాంక్రీటు ఆదివారం ఉదయం 7గంటలకు ఈ రికార్డు సాధించామన్నారు.
గతంలో ఇదే ప్రాజెక్టులో 24 గంటల్లో 11 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయడం జరిగిందన్నారు. చైనా దేశంలో త్రిగోరెడ్జెస్ ప్రాజెక్టులో 24 గంటల్లో 13వేల 200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయడంతో అప్పుడు అది ప్రపంచ రికార్డు అయ్యిందన్నారు. దానిని తాము ప్రస్తుతం అధిగమించినట్టు రమేష్‌బాబు తెలిపారు. ఈ కాంక్రీటులో 4,100 మెట్రిక్ టన్నుల సిమెంటు, 25వేల మెట్రిక్ టన్నుల మెటల్, 13వేల మెట్రిక్ టన్నుల ఇసుక ఉపయోగించినట్టు తెలిపారు.
స్పిల్‌వే, స్పిల్ ఛానల్ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతీ విషయంలో సహకరిస్తున్నందుకు నవయుగ సంస్థ మేనేజర్ క్రాంతి, ఆ సంస్థ ప్రతినిధులు శ్రీనినాసకుమార్, అప్పారావులు తెలిపారు. ఇదిలావుండగా అసలు కాంక్రీటులో 36 గంటల్లో 28వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు రంగం సిద్ధమైంది. దాని కోసం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులను ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఆహ్వానించారు. అయితే పెథాయ్ తుపాను కారణంగా ఆ కార్యక్రమం వాయిదాపడింది. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి రెండో వారానికి వాయిదా పడినట్టు తెలిసింది. ఆదివారం ఉదయం కాంక్రీటు పనుల్లో ప్రపంచస్థాయి రికార్డు సాధించిన అనంతరం తుపాను కారణంగా కాంక్రీటు పనులు నెమ్మదించాయి.

చిత్రం..స్పిల్ ఛానల్‌లో మిషన్ ద్వారా కాంక్రీటు వేస్తున్న దృశ్యం