ఆంధ్రప్రదేశ్‌

వైకాపా నేత తిప్పేస్వామికి స్పీకర్ అపాయింట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 17: అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే టి.ఈరన్నపై అనర్హత వేటు నేపధ్యంలో రెండవ స్థానంలో నిలిచిన వైకాపా అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నుంచి కబురు అందింది. ఈనెల 19వ తేదీ కలవాలని అపాయింట్‌మెంట్ లభించింది. మడకశిర ఎన్నికపై హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల నేపధ్యంలో తిప్పేస్వామి, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని వినతిపత్రం అందజేసిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో స్పీకర్ అపాయింట్‌మెంట్ లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు తనను కలవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆహ్వానించినట్లు సమాచారం. స్పీకర్‌తో మాట్లాడిన తరువాత ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా శ్రేణులు పేర్కొంటున్నాయి.