ఆంధ్రప్రదేశ్‌

నేడు సీఎంతో నెదర్లాండ్ ప్రతినిధి బృందం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: నెదర్లాండ్స్ రాయబారి మార్టిన్ వాన్ డెన్ బెర్క్, 17 మంది కంపెనీ ప్రతినిధులతో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెలగపూడి సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కాబోతున్నారు. నెదర్లాండ్స్‌కి చెందిన మల్టినేషనల్ కంపెనీలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రిటెక్, స్మార్ట్ సిటీస్, వెస్ట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ రంగాల కంపెనీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో సమావేశం జరిగే విధంగా ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ప్రముఖ పాత్ర నిర్వహించింది.
సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న విదేశాలకు చెందిన మల్టినేషనల్ కంపెనీలకు ఏపీఎన్‌ఆర్‌టీ అందించే సహకారాన్ని తెలుసుకోవడంతో పాటు ఇతర ప్రాధాన్యత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ బృందం తాడేపల్లికి చేరుకుని ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు వ్యాపార సంబంధ అంశాలపై ఈ బృంద సభ్యులతో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీజీ సొసైటీని సందర్శిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుండి రాత్రి 8.40 గంటలకు బయలుదేరి న్యూఢిల్లీ వెళతారు.