ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాద మృతులకు సచివాలయ ఉద్యోగుల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 18: నల్గొండ జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఏపీ సచివాలయ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి పీఎస్ భాస్కర్ అందించిన సేవలు మరువలేనివని పలువురు సహచర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సంతాప సమావేశంలో హరికృష్ణ, భాస్కర్‌రావుకు పలువురు నివాళులర్పించారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు ఉద్యోగులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. సచివాలయం మూడో బ్లాక్ ఎదుట హరికృష్ణ, భాస్కర్‌రావు మృతికి సంతాప సూచకంగా సచివాలయ ఉద్యోగులు రెండు నిముషాలు వౌనం పాటించారు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలు మాట్లాడుతూ సెలవు రోజుల్లో కుటుంబంతో గడిపేందుకు ఆనందంగా వెళ్లి తిరిగి విధులకు హాజరయ్యేందుకు అమరావతికి కారులో రెవెన్యూ డిపార్టుమెంట్ అసిస్టెంట్ సెక్రటరీ రఘువీరాంజనేయులు, సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ, రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి పీఎస్ భాస్కర్‌రావు, వాటర్ రిసోర్స్ డిపార్టుమెంట్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్ పాపయ్య, ఎన్నికల కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మి బయల్దేరారని వివరించారు. కోదాడ సమీపంలోకి రాగానే కారు బోల్తోపడటంతో సంఘటన స్థలంలోనే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ, పీఎస్ భాస్కర్‌రావు మృతిచెందారని తెలిపారు. వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్ పాపయ్య, ఎన్నికల కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. హరికృష్ణ, భాస్కర్‌రావు తమ శాఖల్లో ప్రశంసనీయమైన సేవలందించారని గుర్తుచేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఉద్యోగులు భగవంతుని ప్రార్థించారు. సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రమణయ్య, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, పలువురు సభ్యులు పాల్గొన్నారు.