ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీల అమలుకు 4న ఢిల్లీలో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలోని హమీల అమలు కోసం, రాష్ట్రానికి కేంద్ర నిధుల కేటాయింపులపై పార్లమెంట్ చివరి సమావేశాల సందర్భంగా జనవరి 4న సీపీఐ, సీపీఐ (ఎం)ల ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. విశాఖలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీకీ ప్రత్యేక హోదా, విభజన హమీల అమలు కోసం నాలుగున్నరేళ్లగా ఉద్యమిస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదున్నారు. విభజన హమీల అమలు సంగతి గాలికొదిలేసి, చివరి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత మాయ మాటలతో మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ కపట నాటకాలను రాష్ట్ర ప్రజానీకం గ్రహించారన్నారు. ఏపీకీ లోటు బడ్జెట్ ఉన్నా పూర్తి స్థాయిలో నిధులు సక్రమంగా ఇవ్వకపోగా, హమీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామన్న మోదీ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని, రాష్ట్రంలో కరవు తీవ్ర విలయతాండవం చేస్తుంటే, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం సక్రమంగా అందించలేదన్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలి పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ జనాన్ని మోసం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.